జూన్ 2026లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబన్సిరి జిల్లాకు చెందిన ‘నాహ్ వెల్ఫేర్ సొసైటీ’ (NWS), గత 10-15 సంవత్సరాలుగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తమ సాంప్రదాయ భూభాగాలను ఆక్రమించుకుని, అక్కడ రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించిందని ఆరోపించింది. భారత సైన్యం ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టివేసింది. అదే సమయంలో, భారత్-చైనా సరిహద్దును స్పష్టంగా గుర్తించకపోవడం వల్ల కొన్నిసార్లు అక్రమ ప్రవేశాలు జరుగుతున్నప్పటికీ, భారత భూభాగంలోకి చైనా చొరబాటు జరగలేదని కేంద్ర మంత్రి [...]
The post అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబడిందంటూ సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.
జూన్ 2026లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబన్సిరి జిల్లాకు చెందిన ‘నాహ్ వెల్ఫేర్ సొసైటీ’ (NWS), గత 10-15 సంవత్సరాలుగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) తమ సాంప్రదాయ భూభాగాలను ఆక్రమించుకుని, అక్కడ రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించిందని ఆరోపించింది. భారత సైన్యం ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టివేసింది. అదే సమయంలో, భారత్-చైనా సరిహద్దును స్పష్టంగా గుర్తించకపోవడం వల్ల కొన్నిసార్లు అక్రమ ప్రవేశాలు జరుగుతున్నప్పటికీ, భారత భూభాగంలోకి చైనా చొరబాటు జరగలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, చైనా PLA దళాలు అరుణాచల్ ప్రదేశ్‌లోకి సుమారు 60 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చారంటూ కొన్ని వీడియో క్లిప్‌లు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
ఆర్కైవ్ పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.క్లెయిమ్: అరుణాచల్ ప్రదేశ్‌లోకి 60 కిలోమీటర్ల మేర చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చొరబడినప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియోలలో ఏ ఒక్కటీ అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబాటును చూపడం లేదు. మొదటి క్లిప్ రాయల్ థాయ్ ఆర్మీ శిక్షణా కార్యక్రమానికి సంబంధించినది కాగా, రెండవ, మూడవ క్లిప్‌లు మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సిబ్బందికి సంబంధించిన వేర్వేరు సంఘటనలకు సంబంధించినవి. ఈ వీడియోలకు భారత్-చైనా సరిహద్దుతో సంబంధం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
క్లిప్ 1:
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, థాయ్ సైనిక సిబ్బంది కార్యకలాపాలు, శిక్షణను నమోదు చేసే, థాయ్‌లాండ్‌కు చెందిన ‘లియాంగ్ఫా ఖా ఖాంగ్’ అనే ఫేస్బుక్ పేజీ 16 జూన్ 2026న ఇదే వీడియోని (ఆర్కైవ్) అప్లోడ్ చేసినట్లు గుర్తించాం.

ఈ పోస్టు ప్రకారం, ఈ వీడియో రాయల్ థాయ్ ఆర్మీ యొక్క 3వ బెటాలియన్, 2వ రెజిమెంట్‌కు చెందిన నాన్-కమిషన్డ్ ఆఫీసర్ (NCO) క్లాస్ 3069 శిక్షణార్థులు ఉన్నారు. ఈ యూనిట్‌కు చెందిన ఆకుపచ్చ జెండాతో పాటు ఇతర దృశ్యాలను ఈ పేజీలో అప్లోడ్ చేసినట్లు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) చూడవచ్చు.

క్లిప్ 2:
రెండవ క్లిప్‌లో చేతుల్లో కర్రలు పట్టుకుని పరిగెడుతున్న మహిళల బృందం కనిపిస్తుంది. ఈ దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో కనీసం ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంది ఉన్నట్లు గుర్తించాం. ఇది మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో ఉన్న హూమి టంగ్ఖుల్ నాగా గ్రామానికి చెందిన వీడియోగా పేర్కొన్నారు. ఇదే దృశ్యాలను చూపుతున్న స్థానిక మీడియా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, ఈ వీడియో అస్సాం రైఫిల్స్ సిబ్బంది కాల్పులకు పౌరులు గురయ్యారని ఆరోపించబడిన ఒక సంఘటనకు సంబంధించినది.

క్లిప్ 3:
మూడవ క్లిప్‌కు సంబంధించి అనేక వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) మాకు లభించాయి. ఆ కథనాల ప్రకారం, మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో 2026 జూన్ 7న స్థానికులకు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణను ఈ వీడియో చూపిస్తుంది. న్యూ హెవెన్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ అవుట్‌పోస్ట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి.

భారత్-చైనా సరిహద్దు వెంబడి చైనా చొరబాటుకు సంబంధించిన దృశ్యాలు ఏవీ ఈ వీడియోలలో లేవని PIB ఫ్యాక్ట్ చెక్ కూడా స్పష్టం చేసింది.
చివరిగా, అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA 60 కిలోమీటర్లు చొరబడిందని సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు.