Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

సంబంధం లేని పాత వీడియోను ఒక వ్యక్తి శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

Дата публикации: 03-07-2026 12:19:57

పలువురు పోలీసులు ఓ యువకుడిని లాఠీలతో కొడుతున్నట్లు కనిపించే వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, అది ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలని పేర్కొంటున్నారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో ఈ కథనం ద్వారా పరిశీలిద్దాం. క్లెయిమ్: ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు [...]
The post సంబంధం లేని పాత వీడియోను ఒక వ్యక్తి శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.


Основное содержимое страницы с новостью.

పలువురు పోలీసులు ఓ యువకుడిని లాఠీలతో కొడుతున్నట్లు కనిపించే వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, అది ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలని పేర్కొంటున్నారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో ఈ కథనం ద్వారా పరిశీలిద్దాం.

ఆర్కైవ్ చెయ్యబడ్డ పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఇది మే 2021 నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పాత వీడియో. ఇది మహారాష్ట్రలోని జల్నా పట్టణంలోని దీపక్ ఆసుపత్రిలో, కోవిడ్-19 రోగి మరణం అనంతరం జరిగిన ఉద్రిక్తతల సందర్భంగా బీజేపీ యువ మోర్చా కార్యదర్శి శివరాజ్ నారియల్‌వాలేను పోలీసులు కొడుతున్న వీడియో. ఈ ఘటనపై జరిగిన విచారణలో పోలీసులు అతిగా బలప్రయోగం చేసినట్లు తేలడంతో, ఒక పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కాబట్టి, పోస్టులో చేసిన వాదన తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యాలు ఉన్న 2021 మే నెలకు చెందిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వాటి ప్రకారం, ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా పట్టణంలోని దీపక్ ఆసుపత్రిలో జరిగింది. శివరాజ్ నరియాల్వాలే అనే బీజేపీ కార్యకర్త, జల్నా నగరంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ పై దాడి చేశాడనే కారణంతో పోలీసులు అతన్ని లాఠీలతో కొట్టినట్టు ఈ నివేదికల ద్వారా స్పష్టం అయింది.

2021 మే 28న ప్రచురితమైన ANI కథనం ప్రకారం, కదీమ్ జల్నా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ మహాజన్ మాట్లాడుతూ, రోగి మరణం తర్వాత ఆసుపత్రిలో ధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, రోగి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిపారు.

ప్రాథమిక విచారణ అనంతరం, ఈ ఘటనలో శివరాజ్ నారియల్‌వాలేపై పోలీసులు అతిగా బలప్రయోగం చేసినట్లు తేలడంతో, ఒక పోలీస్ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

గతంలో కూడా ఇదే వీడియోను, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసిన అంబులెన్స్ డ్రైవర్‌ను పోలీసులు కొడుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే ఈ వాదనను ఫ్యాక్ట్లీ తప్పు అని నిర్ధారించింది.

చివరిగా, సంబంధం లేని పాత వీడియోను శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు అతన్ని కొడుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

Factly

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబడిందంటూ సంబంధంలేని వీడియోలను షేర్ చేస్తున్నారు0608-07-2026
2Unrelated videos from Manipur and Amarnath Yatra are shared as civilians confronting Chinese troops in Arunachal Pradesh0508-07-2026
3Unrelated videos falsely linked to alleged Chinese PLA intrusion into Arunachal Pradesh0607-07-2026
4అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి తమిళనాడు సీఎం విజయ్ ఎలాంటి కొత్త శిక్షలు, జరిమానాలు ప్రకటించలేదు0506-07-2026
5Video of wife attacking husband over domestic violence in Bangladesh falsely shared as daughters attacking father in Kerala0703-07-2026
6Полиция проверит информацию о применении пыток к юноше в Крыму0018-02-2020
7Полиция проводит проверку после инцидента на вечеринке на главной улице Краснодара0007-06-2020
8Полиция проводит проверку избиения сотрудниками ГИБДД жителя Свердловской области0017-01-2019
9СК возбудил дело после публикации видео с избиением подростка полицейскими в Орске0021-12-2018
10Источник: напавший на полицейских в Сургуте был сотрудником МЧС0002-08-2019

Классификация: Происшествия. Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 5. Источник: factly.in.