తమిళనాడులో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి పది లక్షల రూపాయల జరిమానాతో పాటు, జైలు శిక్ష విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆదేశించారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని సీఎం విజయ్ ప్రకటించినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: తమిళనాడులో [...]
The post అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి తమిళనాడు సీఎం విజయ్ ఎలాంటి కొత్త శిక్షలు, జరిమానాలు ప్రకటించలేదు appeared first on FACTLY.
తమిళనాడులో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి పది లక్షల రూపాయల జరిమానాతో పాటు, జైలు శిక్ష విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆదేశించారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని సీఎం విజయ్ ప్రకటించినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చుక్లెయిమ్: తమిళనాడులో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి పది లక్షల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా చెయ్యాలని సీఎం విజయ్ ప్రకటించారు.
ఫాక్ట్: ముఖ్యమంత్రి విజయ్ అలాంటి కొత్త శిక్షలు, జరిమానాలు విధిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడేవారిపై ఇప్పటికే అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, ‘తమిళనాడు ఆస్తి నష్టపరిహార నిరోధక చట్టం (TNPPDL Act)’ వంటి చట్టాల కింద మాత్రమే చర్యలు తీసుకుంటారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలో చెబుతున్నట్లుగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు ఆధారాలు లభించలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ తమిళ మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించిన వార్తను ప్రసారం చేయలేదు.
ఇక, వైరల్ వీడియోలో ప్రస్తావించిన అంబేద్కర్ విగ్రహం ఘటన గురించి వెతకగా పలు వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వాటి ప్రకారం, మే 2026లో మదురై జిల్లా సిమ్మక్కల్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఒక వాహనం ఢీకొట్టడంతో అది దెబ్బతింది. దీంతో స్థానిక VCK పార్టీ కార్యకర్తలు, ఇతర సంఘాల నేతలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

దెబ్బతిన్న విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సమయంలో స్థానిక TVK నేతలు అక్కడికి చేరుకుని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు (ఇక్కడ & ఇక్కడ). వాస్తవానికి, 2019లో వేదారణ్యంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ఘటన తర్వాత జాతీయ నేతల విగ్రహాల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. చట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టులకు లేదని ఆ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.
— 𝐌𝐚𝐝𝐮𝐫𝐚𝐢 𝐌𝐮𝐧𝐢𝐬 𝐕𝐂𝐊 (@munisvck11) May 25, 2026#மதுரை சிம்மக்கல்
பகுதியில் மாவட்ட
நூலகம் அருகில் உள்ள சேதமடைந்த புரட்சியாளர் அம்பேத்கர் சிலையை மாற்றி..▪️தமிழக அரசு புதிய முழு
உருவ வெண்கலச் சிலை
மாற்றிக் கொள்ள அனுமதி கோரி விடுதலை சிறுத்தைகள் கட்சியின் மதுரை மைய மாவட்ட சார்பில் கவன ஈர்ப்பு
ஆர்ப்பாட்டம்..@thirumaofficial pic.twitter.com/9KJCk3ar1u
అయితే, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి నేరాలకు, ఘటన తీవ్రతను బట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ చట్టాల కింద చర్యలు తీసుకుంటారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 196, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు సెక్షన్ 352, ఆస్తి నష్టం కింద సెక్షన్ 324 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. వీటికి తోడు, దళిత సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసినందుకు ఎస్సీ/ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989 కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉన్న తమిళనాడు ఆస్తి నష్టపరిహార నిరోధక చట్టం,1992 కింద కూడా నిందితులపై చర్యలు తీసుకోవచ్చు.
వీడియోలో చెప్తున్నట్లుగా పది లక్షల జరిమానా విధించడం లేదా కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులను చేయడం లాంటి కొత్త నిబంధనలనేవీ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకురాలేదు.
చివరిగా, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి తమిళనాడు సీఎం విజయ్ కొత్త శిక్షలు, జరిమానాలు విధించారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.