ఓ ముస్లిం మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరినట్లు, దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). ఈ వాదనలో నిజమెంతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. క్లెయిమ్: ఈ వీడియో ఓ ముస్లిం మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసురుతున్నట్లు చూపిస్తోంది. ఫాక్ట్: ఈ వీడియోలో పుణెలోని ససానే నగర్‌లో 10 ఆగస్టు 2026న ఓ మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు [...]
The post పుణెలోని ససానే నగర్‌లో శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరిన మహిళ ముస్లిం కాదు appeared first on FACTLY.
ఓ ముస్లిం మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరినట్లు, దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). ఈ వాదనలో నిజమెంతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆర్కైవ్ చయ్యబడ్డ పోస్టును ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్: ఈ వీడియో ఓ ముస్లిం మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసురుతున్నట్లు చూపిస్తోంది.
ఫాక్ట్: ఈ వీడియోలో పుణెలోని ససానే నగర్‌లో 10 ఆగస్టు 2026న ఓ మహిళ శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరిన ఘటనను చూపిస్తోంది. ఈ మహిళను అశ్విని దగ్డేగా గుర్తించారు. ఆమె ముస్లిం మహిళ కాదు, హిందువు. మీడియా కథనాలు, అలాగే కాలేపడల్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గిరీషా నింబాళ్కర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కాబట్టి, ఈ వీడియోపై చేస్తున్న వాదన తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇదే దృశ్యాలతో కూడిన వీడియోలు పలు మీడియా సంస్థల సోషల్ మీడియా పోస్టులలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కనిపించాయి. ఈ పోస్టుల ప్రకారం, ఈ ఘటన 10 ఆగస్టు 2026న మహారాష్ట్రలోని పుణెలో ససానే నగర్‌లో జరిగింది. అలాగే, ఓ పోస్ట్ లో వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ చుట్టూ పలువురు వ్యక్తులు, ముఖంపై ఇంక్ పూసి ఉండటం, పక్కన మహిళా పోలీసులు ఉండటం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి కాలేపడల్ పోలీసులు అశ్విని దగ్డే అనే మహిళపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలిసింది (ఇక్కడ, ఇక్కడ).
Screenshot
తర్వాత, కాలేపడల్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గిరీషా నింబాళ్కర్‌ను సంప్రదించగా, ఆమె వైరల్ అవుతున్న వాదనను ఖండించారు. ఈ ఘటనలో ఉన్న మహిళ ముస్లిం కాదని, ఆమెను అశ్విని దగ్డేగా గుర్తించినట్లు తెలిపారు. 10 ఆగస్టు 2026న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూడా ఆమె ధృవీకరించారు. శివాజీ మహారాజ్ విగ్రహంపై ఆమె చెప్పులు ఎందుకు విసిరిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చివరిగా, పుణెలోని ససానే నగర్‌లో శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరిన మహిళ ముస్లిం కాదు.
| # | Наименование новости | Тональность | Информативность | Дата публикации |
|---|---|---|---|---|
| 1 | The woman who threw slippers at the Shivaji Maharaj statue in Sasane Nagar, Pune, is not Muslim | 0 | 3.36 | 12-08-2026 |
| 2 | The phone snatcher caught by sisters in Gwalior is not a Muslim | 0 | 5.86 | 12-08-2026 |
| 3 | గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ఘటనలో పట్టుబడిన వ్యక్తి ముస్లిం కాదు | 0 | 6.53 | 12-08-2026 |
| 4 | Muslim Michigan Senate Candidate Responds To Trump: ‘Sarah And I Actually Like Each Other’ | 0 | 13.87 | 10-08-2026 |
| 5 | СК Саратова возбудил дело после нападения на полицейского женщины с ножом | 0 | 0 | 01-10-2021 |
| 6 | В Кургане завели дело за танцы на памятнике погибшим воинам | 0 | 0 | 28-07-2025 |
| 7 | Танцевавшую на памятнике погибшим воинам жительницу Кургана задержали | 0 | 0 | 28-07-2025 |
| 8 | Разъяренная женщина с топором атаковала российских автомобилистов и попала на видео | -5 | 5 | 16-07-2026 |
| 9 | СМИ: полиция задержала вооруженную женщину в небоскребе Trump Tower в Чикаго | 0 | 0 | 06-04-2023 |
| 10 | В Кургане женщину будут судить за осквернение Обелиска Победы | 0 | 5 | 10-06-2026 |