Вход на сайт

Просмотр новости

Найдите то, что Вас интересует

గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ఘటనలో పట్టుబడిన వ్యక్తి ముస్లిం కాదు

Дата публикации: 12-08-2026 07:46:46

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తమ మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతున్న ఒక ముస్లిం వ్యక్తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెంబడించి పట్టుకొని కొడుతున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ముస్లిం వ్యక్తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెంబడించి పట్టుకున్న దృశ్యాలు. ఫాక్ట్: ఈ ఘటనలో పట్టుబడిన నిందితుడి పేరు మన్‌ప్రీత్ సింగ్. ఇతను ముస్లిం కాదని, పంజాబ్ రాష్ట్రానికి [...]
The post గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ఘటనలో పట్టుబడిన వ్యక్తి ముస్లిం కాదు appeared first on FACTLY.


Основное содержимое страницы с новостью.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తమ మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతున్న ఒక ముస్లిం వ్యక్తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెంబడించి పట్టుకొని కొడుతున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఫోన్ దొంగతనం చేసిన ముస్లిం వ్యక్తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు వెంబడించి పట్టుకున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ ఘటనలో పట్టుబడిన నిందితుడి పేరు మన్‌ప్రీత్ సింగ్. ఇతను ముస్లిం కాదని, పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడని స్థానిక పడావ్ పోలీసులు స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఘటనకి సంబంధించిన పలు వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 08 ఆగస్ట్ 2026న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హర్షిత అగర్వాల్, రషిత అగర్వాల్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్కూటీపై వెళ్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి వారి ఫోన్ లాక్కున్నాడు. హర్షిత, రిషిత అతన్ని వెంబడించి పట్టుకొని స్థానిక పోలీసులకి అప్పగించారు. దీనికి సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

నిందితుడి పేరు మన్‌ప్రీత్ సింగ్ అని, అతను పంజాబ్ నుంచి వచ్చాడని స్థానిక పడావ్ పోలీసు విచారణలో వెల్లడైంది. ఇదే విషయం గురించి పడావ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, SHO శైలేంద్ర భార్గవ మాట్లాడుతూ, నిందితుడి పేరు మన్‌ప్రీత్ సింగ్ అని, అతని తండ్రి పేరు జస్పాల్ సింగ్ అని, వారు ముస్లిం మతస్థులు కారని స్పష్టం చేశారు.

చివరిగా, వైరల్ వీడియోలో ఫోన్ దొంగతనం చేసి పట్టుబడిన వ్యక్తి ముస్లిం కాదు.

Схожие новости

#Наименование новостиТональностьИнформативностьДата публикации
1The phone snatcher caught by sisters in Gwalior is not a Muslim05.8612-08-2026
2The woman who threw slippers at the Shivaji Maharaj statue in Sasane Nagar, Pune, is not Muslim03.3612-08-2026
3పుణెలోని ససానే నగర్‌లో శివాజీ మహారాజ్ విగ్రహంపై చెప్పులు విసిరిన మహిళ ముస్లిం కాదు04.7313-08-2026
4В Индии пассажир сбросил с поезда предполагаемого телефонного вора и сам оказался под следствием09.9224-07-2026
5В Индии пассажир сбросил с поезда предполагаемого телефонного вора и сам оказался под следствием09.9224-07-2026
6В Москве избили и ограбили директора индийской фармацевтической компании0015-02-2019
7Сообщившего о ложном минировании ТЦ в Петербурге задержали0028-06-2020
8Липецкие полицейские вернули владелице похищенный в магазине телефон08.9802-08-2026
9В Москве из машины, припаркованной у ТЦ, похитили мобильные телефоны на 2,6 млн рублей0003-06-2020
10В Москве мужчина вырвал телефон у пассажира метро и попытался скрыться0005-08-2025

Классификация: . Схожих патентов: 0. Схожих новостей: 10. Тональность: 0. Информативность: 6.53. Источник: factly.in.