జార్ఖండ్‌లో పీఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాషాయ జెండాలు పట్టుకుని ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. క్లెయిమ్: పీఎస్‌సీ పరీక్షల సమస్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వీడియో. ఫాక్ట్: UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణి సేన జైపూర్‌లో చేసిన ధర్నాను [...]
The post జైపూర్ కర్ణి సేన ర్యాలీకి సంబంధించిన వీడియోను జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జండాలు పట్టుకుని చేసిన ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు appeared first on FACTLY.
జార్ఖండ్‌లో పీఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాషాయ జెండాలు పట్టుకుని ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
ఆర్కైవ్ చయ్యబడ్డ పోస్టును ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్: పీఎస్‌సీ పరీక్షల సమస్యలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వీడియో.
ఫాక్ట్: UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణి సేన జైపూర్‌లో చేసిన ధర్నాను ఈ వీడియో చూపిస్తుంది. కర్ణి సేన సభ్యులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లి, బీజేపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీచార్జ్ చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ర్యాలీ వీడియో కాదు. కాబట్టి ఈ పోస్టు తప్పుదోవ పట్టిస్తుంది.
వైరల్ వీడియోలోని ఒక కీఫ్రేమ్‌తో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 6 ఆగస్టు 2026న ఇండియా టుడే ప్రచురించిన “Rage over caste reservation spills onto streets; Karni Sena vows no vote” అనే కథనం కనిపించింది. ఈ కథనంలో ఉన్న ఫోటో కొలాజ్‌లో, వైరల్ వీడియోలోని దృశ్యాలు సరిపోలాయి.
Screenshot
ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), UGC 2026 ఈక్విటీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా నేతృత్వంలో వేలాది మంది సభ్యులు 24 రోజుల పాటు 800 కి.మీ. పాదయాత్ర చేసి జైపూర్‌కు చేరుకున్నారు. కర్ణి సేన సభ్యులు కలెక్టరేట్ వైపు ర్యాలీగా వెళ్లి, బీజేపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కేనన్లు, లాఠీచార్జ్ చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
The Logical Indian ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక రీల్ కనిపించింది. ఈ రీల్‌లోని వీడియో వైరల్ వీడియోతో పూర్తిగా సరిపోలింది.
వార్తా కథనాల్లోని సమాచారాన్ని ఆధారంగా తీసుకుని, ఈ ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని జియోలోకేట్ చేశాం. ఈ ర్యాలీ జైపూర్‌లోనే జరిగినట్లు నిర్ధారించాం. వైరల్ వీడియోలోని దృశ్యాలను, జియోలోకేషన్ ద్వారా గుర్తించిన ప్రదేశం మధ్య పోలికను కింద చూడవచ్చు.
Screenshot
చివరిగా, జైపూర్ కర్ణి సేన ర్యాలీకి సంబంధించిన వీడియోను జార్ఖండ్‌లో విద్యార్థులు కాషాయ జండాలు పట్టుకుని చేసిన శాంతియుత ర్యాలీ అంటూ షేర్ చేస్తున్నారు.